Book Description
ఈ ప్రపంచాన్ని చూడాలంటే మీ కళ్ళతో కాదు, మీ యాటిట్యూడ్‌తో చూడాలి. మీ యాటిట్యూడ్ ఒక అద్దాల కిటికీలాంటిది. అది శుభ్రంగా ఉండాలి. కాని ‘బంధుమిత్రుల విమర్శలనే దుమ్ముతో, వైఫల్యాలు అనే ధూళితో, పిరికితనం, భయం అనే మరకలతో అద్దం మసకబారిపోయింది’. ఈ పుస్తకం ఆ దుమ్ము ధూళిని శుభ్రపరిచే క్లీనర్ లాంటిది. ఈ పుస్తకం ఒకే రోజు అంతా నవల లాగ చదివేయకండి. రోజూ అరగంటసేపు చదివి, మీ స్వంతంగా నోట్సు తయారు చేసుకోండి.